Browse By

నేను కేసీఆర్ మేనల్లుడ్ని!

మద్యంమత్తులో ఉన్న వ్యక్తి సిద్దిపేట ఠాణాలో హల్‌చల్

ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడ్ని అంటూ ఓ వ్యక్తి ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. తనకు అడ్డొచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన కొండల్‌రావు మద్యం మత్తులో సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌లోకి వెళ్లి దర్జాగా కుర్చీపై కూర్చున్నాడు.

ఎవరూ అని పోలీసులు ప్రశ్నించడంతో తాను కేసీఆర్ మేనల్లుడ్ని అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. రెండు గంటలపాటు స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కానిస్టేబుల్ అమృత్‌రావుపై దాడికి దిగాడు. అతను మద్యం మత్తులో ఉండడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై వన్‌టౌన్ పోలీసులను సంప్రదించగా కొండల్‌రావు మద్యం మత్తులో ఉన్నాడని, అతడిపై ఏ ఫిర్యాదూ రాలేదని తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail