Browse By

15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా

అనూహ్యంగా తెరమీదికొచ్చిన మరో ఎమ్మెల్యే
♦ 15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా..

♦ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ముఖ్య కాంగ్రెస్ నేతలతో కలిసి

♦ అనూహ్యంగా తెరమీదికొచ్చిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్

♦ ఆయన కూడా అదేరోజు అధికార పార్టీలోకి..

♦ ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో గుత్తా, భాస్కరరావు భేటీ

♦ అక్కడి నుంచి సీఎం కారులోనే క్యాంపు ఆఫీసుకు

♦ అక్కడ జిల్లా మంత్రితో చర్చల అనంతరం నిర్ణయం

ఉత్కంఠకు తెర పడింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ నెల 15న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరనున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆదివారం మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి సీఎం ఫాంహౌస్‌తో పాటు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో ముహూర్తం ఖరారైంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో పాటు ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన బుధవారం గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరుతున్నారన్న వార్తలు వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు నిర్ణయం జరుగుతుంది? అసలు చేరుతారా లేదా అనే సందేహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా రాజకీయ వర్గాల సస్పెన్స్ వీడినట్టయింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail