Browse By

‘తనీఒరువన్‌’కి రీమేక్‌గా ధృవ

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ధృవ’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తనీఒరువన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పోస్టర్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ ముఖం మాత్రమే కనిపిస్తూ…మొత్తాన్ని ఫార్మూలాలతో నింపేశారు. రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా బాగుంది. చరణ్ సెట్‌లో ఉంటే టీమ్ అందరూ ఎనర్జిటిక్‌గా ఉంటారని..కశ్మీర్‌లో ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తిచేసుకుందని దర్శకుడు సురేందర్ రెడ్డి ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. 
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా నవదీప్ కీలకపాత్ర పోషిస్తుండగా…విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail