Browse By

జూరాలకు చేరిన కర్ణాటక తాగునీరు.

నారాయణపూర్ డ్యాం నుంచి పాలమూరు జిల్లా జూరాల ప్రాజక్టుకు శనివారం ఉదయానికి 1 టిఎంసిల కృష్ణా జలాలు చేరుకున్నాయి.మహబూబ్ నగర్ ఇరిగేషన్ సిఇ ఖగేందర్ రావు దీన్ని ధృవీకరించారు. మంత్రి హారీష్ రావు కృషి వల్లనే తమ ప్రభుత్వం కృష్ణాజలాల విడుదల చేసినట్టు కర్నాటక జలవనరుల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ శనివారంనాడు బెంగుళూరులో ప్రకటించారు.

 

నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ఈనెల 20న తెలంగాణకు తెలిపింది. ఈ మేరకు కర్నాటక జలవనరుల ప్రిన్సిపల్ కార్యదర్శి రాకేష్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇదే విషయాన్ని కర్నాటక మంత్రి పాటిల్ , టిఎస్ మంత్రి హరీష్ కు వారం క్రితమే స్వయంగా పోన్ చేసి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పాలమూరు జిల్లా ప్రజల పక్షాన హరీష్ కర్నాటకకు ధన్యవాదాలు తెలిపారు.తీవ్ర కరువుతో అల్లాడుతున్న మహబూబ్ నగర్ ప్రజలకు తాగునీరు అందించేందుకు నారాయణపూర్ డ్యాం నుంచి 3 టిఎంసిల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, జూపల్లి, డాక్టర్ సి. లక్శ్మారెడ్డి, ఎంఎల్ఏ గువ్వల బాలరాజు ల బృందం ఇటీవల కర్నాటక కు విజ్ఞప్తి చేసింది. పలుమార్లు కర్నాటక జలవనరుల మంత్రి ఎ oబి పాటిల్ తో పోనులో జరిపిన చర్చలు ఫలించాయి.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail