Browse By

కవి కువెంపు ఇంట్లో పద్మభూషణ్ ను ఎత్తుకెళ్ళారు

పద్మభూషణ్ అవార్డును, ప్రశంసా ఫలకాలను, కొంత సొమ్మును దొంగలించి పారిపోయారు

కర్ణాటకలో ప్రముఖ కవి కువెంపు ఇంట్లో చోరీ జరిగింది. బెంగుళూరు శివమోగాలోని ఆయన ఇంట్లో దొంగలు ప్రవేశించి గతంలో ఆయన పొందిన పద్మభూషణ్ అవార్డును, ప్రశంసా ఫలకాలను, కొంత సొమ్మును దొంగలించి పారిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో వాళ్ళ దోపిడీ దృశ్యాలు రికార్డయ్యాయి.

దుండగులు ఇనుప రాడ్ తో ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ తెలిపినవారికి రివార్డు ఇస్తామని ఖాకీలు ప్రకటించారు. ఈ చోరీ జరిగినప్పుడు ఈ కవి ఇంట్లో ఉన్నారో, లేదో తెలియలేదు. ఆయన సాహిత్య అకాడెమీ అవార్డుతో బాటు పలు పురస్కారాలను అందుకున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail