Browse By

కోట్లు కొల్లగొడుతున్న ‘కుమారి’

రాజ్‌తరుణ్- హేబాపటేల్ జంటగా వచ్చిన ‘కుమారి 21F’

రాజ్‌తరుణ్- హేబాపటేల్ జంటగా వచ్చిన ‘కుమారి 21F’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వీకెండ్‌లో దాదాపు 7 కోట్లు సాధించినట్టు టాక్. ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ రావడంతోపాటు థియేటర్స్ హౌజ్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. దీంతో తొలి మూడు రోజుల్లో ఈ రేంజ్‌లో వసూళ్లు రావడంతో యూనిట్ డబుల్ హ్యాపీ అన్నమాట.

తొలి మూడు రోజుల్లో నైజాం- 2.35 కోట్లు, కోస్తా – సీడెడ్ కలిపి 2.95 రాబట్టింది. ఇక కర్నాటకలో 46 లక్షల రాగా, ఓవర్సీస్ నుంచి 99 లక్షలు(బెనిఫిట్ షోలతో కలిపి) వసూలు చేసింది. ఇకపోతే శాటిలైట్ రైట్స్ రూపంలో సినిమా బడ్జెట్ వచ్చేసిందని, ఇప్పుడు ప్రాఫిట్‌లోకి వెళ్లిందనేది బయ్యర్ల ఆలోచన. ఫస్ట్ వీకెండ్‌ ఇలావుంటే.. వీక్ ముగిసేసరికే అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌కి వచ్చేయడం ఖాయమంటున్నారు. మొత్తానికి స్టార్ హీరోల సినిమాల కంటే, స్మాల్ మూవీస్ ప్రొడ్యూసర్స్‌కి కాసుల పంట పడిస్తోందని మరోమారు రుజువైంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail