Browse By

Daily Archives: October 10, 2016

విజయ దశమి శుభాకాంక్షలు -మంత్రి జగదీష్ రెడ్డి

విజయదశమి పర్వదినాన్నీ జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రప్రజలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి కులాల అబివృద్ది శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు .తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రోత్సవాలను జరుపుకోవడం తో పాటు తెలంగాణ ప్రాంతానికి సాంప్రదయంగా నిలిచిన బతుకమ్మ సంబురాలను అంబరాన్ని అంటే స్థాయిలో జరుపుకుని ఈ రోజు సాంప్రదాయబద్దంగా విజయదశమి పర్వదినోత్సవాన్ని జరుపుకోబోతున్న ప్రజలకు అయన

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖారారు 

కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు కలెక్టర్లు

258 ప‌రుగుల ఆధిక్యం

అశ్విన్ వ‌ల‌లో కివీస్ విల‌విల‌ ఇండోర్‌: మ‌రో క్లీన్‌స్వీప్ ఖాయంగా క‌నిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లోనూ టీమిండియా ప‌ట్టు బిగించింది. మూడోరోజు కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 299 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసిన భార‌త్‌.. 258 ప‌రుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే కివీస్‌ను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన భార‌త్‌.. ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 18 ప‌రుగులు చేసింది.

ఏ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేశారు: శ్రీధర్ బాబు

కరీంనగర్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను స్వాగతిస్తున్నామనీ, శాస్త్రీయ పద్దతిలో జిల్లాల ఏర్పాటు జరగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు పేర్కొన్నారు.   ప్రస్తుతం ఏ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేసి, ఉద్యోగులను కేటాయిస్తున్నారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. చారిత్రాత్మక కరీంనగర్ జిల్లా ఉనికి కోల్పోయేలా విభజన జరిగిందని ఆరోపించారు. ప్రత్యేక జిల్లాల కోసం పారాడిన వారిపై కేసులను

21 నూతన జిల్లాల ప్రారంభం

జిల్లాల ప్రారంభం.. ఏ జిల్లాకు ఏ మంత్రి హైదరాబాద్: విజయదశమి సందర్భంగా రాష్ట్రంలో 21 నూతన జిల్లాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు కర్కాటక లగ్నంలో జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రేపు ఉదయం ధనుర్ లగ్నంలో 11.13 నిమిషాలకు జిల్లాలు ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల మీదుగా కొత్త జిల్లాలు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు జిల్లాలు వాటిని ప్రారంభించబోయే