Browse By

Daily Archives: September 15, 2016

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ఎమ్మెల్యే దీక్ష

మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా, కడ్తాల, చారకొండలను మండలాలుగా ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి బుధవారం రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  దీక్షకు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, జేఏసీ చైర్మన్ సదానందం మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి నియోజకవర్గంలోని ప్రజలు భారీగా తరలివచ్చారు.