Browse By

Daily Archives: September 12, 2016

సిట్ టీంను పెంచుతూ డీజీపీ నిర్ణయం

హైదరాబాద్: కరుడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో విచారణను వేగవంతం కోసం ఏర్పాటు చేసిన సిట్ టీంను పెంచుతూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 మంది ఇన్‌స్పెక్టర్లు, అడిషనల్ ఎస్పీతో ఐజీ నేతృత్వంలోని బృందం విధులు నిర్వహిస్తుంది. అదనంగా మరో ముగ్గురు నుంచి నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలను సిట్‌లో నియమించనున్నారు.  ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… ఇప్పటి వరకు 71

మహారాష్ట్రలో తెలంగాణ భగీరథ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భగీరథ ప్రయత్నాన్ని స్పూర్తిగా తీసుకుని మహారాష్ట్రలోని మరఠ్వాడలో తాగునీటి పథకాన్ని షురూ చేస్తమన్నరు ఆ రాష్ట్ర తాగునీటి సరాఫరా మంత్రి బబన్ రావ్ లోనిఖర్. మరఠ్వాడలున్న 8 జిల్లాలల్ల మంచినీళ్లకు శాన పరేషాన్ అయితుందన్నరు. ఇదే విషయం మీద కేబినేట్ మీటింగల మాట్లాడుకుంటుంటే, తమ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలంగాణల అయితున్న భగీరథ ప్రాజెక్టు గురించి చెప్పిండన్నరు. 

ప్రాజెక్టులతో ప్రజాధనం వృథా

రాష్ట్రంలో పద్ధతి లేకుండా చేపట్టే ప్రాజెక్టులతో ప్రజాధనం వృథా అవుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. నల్లగొండలో ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక ‘అభివృద్ధి – ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే, అడ్డగోలుగా భూములు లాక్కుంటామంటే ఊరుకోబోమన్నారు. అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు చేపడితే ప్రజాధనం వృథాతో పాటు భవిష్యత్తులో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని