Browse By

Daily Archives: September 9, 2016

వెంకన్నకు కాళోజీ పురస్కారం

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కాళోజీ నారాయణరావు 102వ జయంతి సందర్భంగా ప్రభుత్వం వెంకన్నను కాళోజీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. పురస్కారం అందుకున్న సందర్భంగా వెంకన్న తన తల్లికి పాదాభివందనం చేశారు. వెంకన్నను మంత్రులు కొనియాడారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పురోగతిపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాలు, డివిజన్లు, జిల్లా కార్యాలయాల ఏర్పాటుపై సమీక్షించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. ప్రాధాన్యతల మేరకు మెరుగైన సేవల కోసం శాఖల ఏర్పాటు జరగాలని సూచించారు. శాఖల ఏర్పాటు, సిబ్బంది వివరాల ప్రతిపాదనలు వెబ్‌సైట్‌లో ఉంచాలని

5.3 తీవ్రతతో భూకంపం ..అణుపరీక్షలు!

సియోల్: ఉత్తర కొరియా మరోసారి అణుపరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా ప్రధాన న్యూక్లియర్ సైట్ సమీపంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఖచ్చితంగా అది న్యూక్లియర్ టెస్ట్ మూలంగా సంభవించిన భూకంపంగా ఉత్తర కొరియా వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను అమెరికా, యూరప్ భూకంప పరిశీలన కేంద్రాలు

డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం

కథానాయిక సమంతతో నాగచైతన్య, ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్‌తో అఖిల్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. తనయుల పెళ్లి గురించి గురువారం నాగార్జునను ప్రశ్నించగా – ‘‘డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుంది. ‘సమంతతో ప్రేమలో ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకుంటాను’ అని చైతూ చెప్పాడు.కానీ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పలేదు.

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్ టెక్నికల్ సెంటర్‌

నమస్తే హైదరాబాద్: జర్మనీకి చెందిన ప్రఖ్యాత వాహన ఉపకరణాల తయారీసంస్థ జెడ్‌ఎఫ్ ఫ్రైడ్రిచ్‌షాఫెన్.. హైదరాబాద్‌లో తమ ఇండియా టెక్నికల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ లీడ్ మమత చామర్తి, తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌లు గురువారం హైదరాబాద్‌లో