Browse By

Daily Archives: August 24, 2016

దావూద్ ఆచూకీని నిర్ధారించిన ఐక్య‌రాజ్య‌స‌మితి

పాకిస్థాన్ మాత్రం దావూద్ ఆచూకీ తెలియ‌ద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి విన్నవించింది అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీకి సంబంధించి భార‌త్ అందించిన చిరునామాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి నిర్ధారించింది. దావూద్ పాకిస్థాన్‌లో తల‌దాచుకున్నాడంటూ మొత్తం తొమ్మిది అడ్రెస్‌ల‌ను ఐక్యరాజ్య‌స‌మితికి భార‌త్ అప్పగించింది. అందులో మూడు చిరునామాల‌ను కొట్టిపారేసిన ఐక్య‌రాజ్య‌స‌మితి మిగతా ఆరు అడ్రెస్‌లను మాత్రం నిర్ధారించింది. కానీ పాకిస్థాన్ మాత్రం దావూద్ ఆచూకీ తెలియ‌ద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి విన్నవించింది.

మందుబాబులూ…ఆరు నెల్లు జైలంట

అమెండ్‌మెంట్ 2016 అమల్లోకి రానుండటంతో అప్రమత్తంగా ఉండాలి మందుబాబులూ తస్మాత్ జాగ్రత్త…! ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. పదివేల జరిమానా చెల్లించడంతో పాటు ఏకంగా ఆర్నెళ్ల పాటు జైలు ఊచలు లెక్కించాల్సిందే… త్వరలో అమెండ్‌మెంట్ 2016 అమల్లోకి రానుండటంతో మద్యం తాగేవారు అప్రమత్తంగా ఉండాలని నగరంలోని సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన

ఒప్పందం కుదరడానికి మంత్రి హరీశ్‌ విశేష కృషి

ఇరు రాష్ట్రాల సీఎంల పొగడ్తల వర్షం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదరడానికి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు విశేష కృషి చేశారని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, దేవేంద్ర ఫడణవీస్‌ అభినందించారు. గత ఏడాదిన్నరగా మహారాష్ట్రతో సంప్రదింపులు, చర్చలు జరపడంలో అలుపెరుగకుండా కృషి చేశారని కొనియాడారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ

ఇద్దరికీ మరో మూడు నెలలపాటు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల సీఎ్‌సలకు పొడిగింపు సీఎంల వినతి.. కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇద్దరికీ మరో మూడు నెలలపాటు పదవీ కాలం పొడిగింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా

నితిన్‌ గడ్కరీని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఒప్పించారు

తెలంగాణలో 650 కిలోమీటర్ల హైవేలకు ఓకే త్వరలో ప్రక్రియను పూర్తి చేస్తామన్న గడ్కరీ తెలంగాణలో 650 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తన ప్రతిపాదనలకు అంగీకరిస్తూ త్వరలో ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్రం తెలిపిందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి బండారు