Browse By

Daily Archives: August 19, 2016

పీవీ సింధుని అభినందించిన మంత్రి అజ్మీరా చందూలాల్ 

రియో ఒలింపిక్స్ ఉమెన్స్ బాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న పీవీ సింధు ని అభినందించిన మంత్రి అజ్మీరా చందూలాల్  ఫైనల్ లో ఓడినా… భారతదేశ కీర్తి, ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిందని సింధు కి కితాబు. బాడ్మింటన్‌ చరిత్రలో ఒలింపిక్‌ రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.  ఫైనల్లో ఓడినా 125కోట్ల మంది భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుంది.

పివి. సింధుకు అభినందనలు తెలిపిన ఇరిగేషన్ మంత్రి టి.హరీష్ రావు

రియో ఒలంపిక్స్ లో రజతం సాధించిన పివి. సింధుకు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపిన ఇరిగేషన్ మంత్రి టి.హరీష్ రావు . ఇండియా తరపున బ్యాడ్మిo టన్ లో రజతం గెలిచిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు.

రూ. కోటి ప్రకటించిన తెలంగాణ సర్కార్

రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి.. చరిత్రకెక్కిన పీవీ సింధూకు కోటి రూపాయల నజరానా ప్రకటించింది తెలంగాణ సర్కార్. దీంతో పాటు భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరఫునరూ. 50లక్షలు, సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు రూ.10లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. రియో నుంచి తిరిగివచ్చిన తర్వాత ఘనంగా సన్మానించనుంది ప్రభుత్వం.