Browse By

Daily Archives: August 1, 2016

No Thumbnail

రాజ్‌నాథ్‌ భద్రత.. పాక్‌ బాధ్యత

దిల్లీ: పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్న భారత హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భద్రత పట్ల ఆ దేశమే బాధ్యత వహిస్తుందని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. సార్క్‌ సమావేశాల కోసం ఈ వారంలో రాజ్‌నాథ్‌ ఇస్లామాబాద్‌ వెళ్లాల్సి ఉంది. అయితే ఆదివారం లాహోర్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నిర్వహించిన ర్యాలీలో ఆ సంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌మాట్లాడుతూ.. రాజ్‌నాథ్‌ను పాక్‌లో అడ్డుకుంటామని హెచ్చరించారు.

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం కేటీఆర్‌

ఇసుక తవ్వకాల పరిశీలనకు మంత్రి కెటియార్ అకస్మిక తనీఖీ • రాష్ట్రవ్యాప్తంగా అకస్మిక తనీఖీలు కొనసాగుతాయన్నమంత్రి • జిల్లా యంత్రాంగానికి సమాచాకం ఇవ్వకుండా కరీనగర్ జిల్లా కొత్తపల్లి ఇసుక తవ్వకాల పరీశీలన • అక్రమ మైనింగ్ ఉపేక్షించేది లేదన్న మంత్రి • రెవెన్యూ, గనులు, విజిలెన్సు, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా టీంలు • ఈ మాడల్ ను అన్ని అన్ని జిల్లాలు అనుసరించాలన్న

No Thumbnail

పార్లమెంటు వద్ద తెదేపా ఎంపీల ధర్నా

దిల్లీ: పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో ఎంపీలు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో

No Thumbnail

పెరిగిన రెనాల్ట్‌ అమ్మకాలు

న్యూదిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్‌ ఇండియా అమ్మకాల్లో వృద్ధిని సాధించినట్లు తెలిపింది. ముగిసిన జులైలో 11,968 కార్లను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది ఇదే నెలలో కేవలం 1,686 కార్లను మాత్రమే విక్రయించినట్లు పేర్కొంది.ఇక ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య కాలంలో ఏకంగా 73,863 కార్లు అమ్ముడుపోగా, గతేడాది ఇదే కాలంలో 25,032 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు కంపెనీ

No Thumbnail

జైట్లీతో సుజనా, సీఎం రమేశ్‌ భేటీ

న్యూదిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌జైట్లీతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ఆర్థిక సాయంపై ఆయనతో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం సుజనా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని కార్యాలయ సిబ్బందిని స్వయంగా ఆయనే సంప్రదించినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం కోసం సుజనా సమయం కోరినట్లు తెలిసింది.