Browse By

Daily Archives: July 28, 2016

No Thumbnail

ట్రంప్‌తో పోలిస్తే వారు పనికిరారు: వర్మ

ముంబయి: అమెరికాకి ట్రంప్‌ గొప్ప అధ్యక్షుడవుతాడంటున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ‘‘అమెరికాకి డొనాల్డ్‌ జె ట్రంప్‌ గొప్ప అధ్యక్షుడు అవుతాడని నాకనిపిస్తోంది. ఆయనతో పోలిస్తే మాజీ అధ్యక్షులైన రూజ్‌వెల్ట్‌, లింకన్‌, జాన్‌ కెన్నెడీలు ఎందుకూ పనికిరానివారనిపిస్తుంది. ట్రంప్‌ని తమ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకోవడం ద్వారా అమెరికన్లు మొదటిసారి తెలివిగా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి ట్రంప్‌ ఒక్క అమెరికా సమస్యలే కాకుండా ప్రపంచంలోని అన్ని

No Thumbnail

అభిషేక్‌ బచ్చన్‌ చెప్పిన నిజం!

సినిమా పరిశ్రమ అంటేనే అంత.. విజయాలు ఉన్నప్పుడే బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ మూగుతారు. క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్‌ ఎగబడతారు. ఒక్కసారిగా పరాజయాలు పలుకరించాయా? అంతే సంగతలు.. తెలిసినవారే ముఖం చాటేస్తారు. సూపర్ స్టార్‌ కొడుకైనా, టాప్‌ హీరోయిన్‌ భర్త అయినా పట్టించుకోరు. ఫోన్‌ చేసినా ఎత్తరు. మాట్లాడటం మానేస్తారు. ఇది పచ్చినిజం. ఈ పచ్చినిజాన్ని అనుభవపూర్వకంగా అనుభవించి మరీ చెప్తున్నాడు అభిషేక్‌

No Thumbnail

అసోంలో వరద బీభత్సం: 12 మంది మృతి

అసోం: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, ఉపనదులు మహోగ్రరూపం దాల్చాయి. వరద ఉద్ధృతి కారణంగా ఇప్పటి వరకూ 12 మంది మృతి చెందారు. దాదాపు 20లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ రూ.4లక్షల పరిహారం ప్రకటించింది. అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను

No Thumbnail

నదిలో చిక్కుకుంటే హెలికాప్టర్‌తో కాపాడారు

చండీగఢ్‌: యమునా నది ఉధృతి కారణంగా చిక్కుకుపోయిన ఎనిమిది మంది వ్యక్తులను భారత వైమానిక దళ సిబ్బంది హెలికాప్టర్‌ సహాయంతో రక్షించారు. యమునా నది తీరంలోని యుమునానగర్‌ జిల్లాలో మంధేవాలా గ్రామ సమీపంలో ఎనిమిది మంది వరదలో చిక్కుకుపోయినట్లు కంట్రోల్‌ రూంకు సమాచారం వచ్చిందని హరియాణా రెవెన్యూ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మినిస్టర్‌ కెప్టెన్‌ అభిమన్యు తెలిపారు. నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో వారి