Browse By

Daily Archives: July 14, 2016

క‌బాలి సినిమా అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్

త‌లైవార్‌ ‘కబాలి’ అమెరికాలో సంచలనంగా మారింది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ర‌జ‌నీకాంత్ సినిమా అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 400 థియేట‌ర్లలో ఈనెల 22న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ముందు రోజు ప్రీమియ‌ర్ షోల‌ు కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ సినీ గెలాక్సీ క‌బాలి సినిమాని అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. క‌బాలి టికెట్ల బుకింగ్

సీఎం ఢిల్లీ పర్యటన

సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్రం నిర్వహించే అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. సీఎం ఢిల్లీ పర్యటన మూడు రోజులపాటు ఉంటుందని ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంవో ఓ నివేదికను కూడా తయారు చేసింది. కేసీఆర్

ఇకపై రూ.3 లక్షలకు మించితే క్యాష్ లావాదేవీలు కుదరవు?

న్యూఢిల్లీ: నల్ల ధనాం కట్టడిపై కేంద్రం నియమించిన సిట్ పలు ప్రతిపాదనలు చేసింది. ఇందులో అతి ముఖ్యమైంది షాక్ కలిగించేదే. మూడు లక్షలకు మించితే నగదు లావాదేవీలు కుదరబోవని తేల్చింది. అంటే 3 లక్షలకు మించి నగదు లావాదేవీ చేయాలంటే ఇకపై కుదరదు. ఒకవేళ మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీ జరపాలంటే అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. అంతేకాదు. 15 లక్షలకు

భారతీయుల కోసం ‘ఆపరేషన్ సంకట్ మోచన్’

ఢిల్లీ: దక్షిణ సుడాన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ సంకట్ మోచన్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం రెండు విమానాలలో సుడాన్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణకు చెందిన 54 మంది, ఏపీకి చెందిన 11 మందిని కేంద్ర విదేశాంగశాఖ భారత్ కు తీసుకురానుంది. గత కొంతకాలం నుంచి దక్షిణ సుడాన్ లో ప్రభుత్వంపై

జర్నలిస్టుల హెల్త్‌, అక్రిడేషన్‌ కార్డుల జారీలో ఆలస్యం వద్దు : సీఎం

హైదరాబాద్ : జర్నలిస్టుల హెల్త్‌, అక్రిడేషన్‌ కార్డుల జారీలో ఆలస్యం చేయోద్దని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను టీయూడబ్ల్యూజే నేతలు క్రాంతి, పల్లె రవి తదితరులు కలిశారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల హెల్త్‌, అక్రిడేషన్‌ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన పై విధంగా అధికారులను ఆదేశించారు.