Browse By

Daily Archives: July 8, 2016

హరిత హారంలో మార్కెటింగ్ శాఖ నెంబర్ వన్

మంత్రి హరీష్ రావు పిలుపు తో మార్కెటింగ్ శాఖ లో ప్రభంజనం.  తొలిరోజు 4లక్షల మొక్కలు నాటిన రికార్డు .  రెండు వారాల్లో 10 లక్షల టార్గట్. హరిత హారం 1 లో మార్కెటింగ్ శాఖ కృషికి సీఎం కెసిఆర్ ప్రశంస.       రెండవ విడత హరిత హారం కార్యక్రమంలో 10 లక్షల మొక్కలు నాటాలని మంత్రి హరీష్ రావు

జూలై 15 నుంచి కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు

కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తేదీలను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఆగష్టు 6 వరకు అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ జె.పూర్ణ చంద్రరావు తెలిపారు. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్పీఎఫ్, ఫైర్‌మన్ విభాగాలలో అర్హత సాధించిన 1,92,588 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 13 చోట్ల

హరితహారం పెద్ద స్కామ్: భట్టి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని ఓ పెద్ద స్కామ్‌గా కాం గ్రెస్ పార్టీ అభివర్ణించింది. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఎంతవుతుందని లెక్కకడితే రూ.1000 కోట్లు తేలిందని, కానీ, నాటిన వాటిలో ఎన్ని మొక్కలు బతుకుతున్నాయో లెక్క తేలడంలేదని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం నల్లగొండలో జరిగిన పార్టీ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం అనంతరం

యాదాద్రి నూతన నమూనా

యాదాద్రి దివ్యక్షేత్రం ప్రధాన ఆలయం నూతన నమూనా సిద్ధమైంది. సీఎం కేసీఆర్.. యాదగిరిగుట్టను తిరుమల తరహా దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సూచనల మేరకు కొండపైన ఆగమ, వాస్తు శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ ప్రణాళికలను తీర్చిదిద్దారు. ముందుగా తయారు చేసిన ప్రణాళికల్లో మార్పులు.. చేర్పులను సీఎం సూచించగా.. అందుకనుగుణంగా వైటీడీఏ అధికారులు తాజా ప్రణాళికలను రూపొందించారు. కొండపైన ప్రధాన ఆలయం,

ఉత్తరాదిన 1000 థియేటర్లలో కబాలి

రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కబాలి చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాషా తర్వాత రజనీకాంత్ మాఫియాడాన్ పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాను ఉత్తరాదిలో దాదాపు 1000కిపైగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రాన్ని పంపిణీ చేస్తున్న ఫాక్స్‌స్టార్ స్టూడియో ప్రకటించింది.